జస్ట్ 15మందితో చైతూ 'లవ్ స్టోరీ'...
on Aug 28, 2020

జస్ట్ 15మందితో 'లవ్ స్టోరీ' షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ పి.రామ్మోహన్ రావు తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రమిది. సాయి పల్లవి హీరోయిన్. సునీల్ నారంగ్ మరో నిర్మాత. సెప్టెంబర్ 7 నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చైతన్య కూడా షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారని ప్రొడ్యూసర్ తెలిపారు.
మార్చి తరవాత స్టార్ హీరోలు ఎవరూ షూటింగ్‌లు చేయలేదు. 'లవ్ స్టోరీ' సెట్స్ మీదకు వెళితే... కరోనా తరవాత తెలుగులో షూటింగ్ స్టార్ట్ చేసిన తొలి హీరో నాగచైతన్య అవుతాడు. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
షూటింగ్‌లో పాల్గొనే 15మందికి ముందే కరోనా టెస్టులు చేయించనున్నారు. అలాగే, షూటింగ్ జరిగినన్ని రోజులూ వాళ్ళను ఇంటికి పంపించకుండా, లొకేషన్ దగ్గర బస ఏర్పాటు చేయనున్నారు. వీళ్ళ ఫార్ములా సక్సెస్ అయితే మరింతమంది ఫాలో అయ్యే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



