ఇక్కడ నీట్... అక్కడ హాట్
on Jan 10, 2020
తెలుగులో సుమారు పదేళ్ల విరామం తర్వాత టబు నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రచార చిత్రాలు చూస్తే... హుందాతనంతో కూడిన పాత్రలో ఆమె నటించారని తెలుస్తోంది. ఇక్కడ నీట్ క్యారెక్టర్ చేసిన టబు... హిందీలో మాత్రం హాట్ హాట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. హిందీలో బోల్డ్ కాన్సెప్ట్స్, హాట్ కంటెంట్ సీన్స్ చేయడానికి టబు ఏమాత్రం వెనుకాడడం లేదు. వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఐదు పదుల వయసులో హాట్ అందాలతో అదరగొడుతున్నారు. 'దే దే ప్యార్ దే'లో గ్లామర్ విషయంలో రకుల్ కు పోటీ ఇచ్చారు టబు.
సైఫ్ అలీఖాన్ తో సుమారు ఇరవై ఏళ్ళ విరామం తర్వాత టబు నటించిన సినిమా 'జవానీ జానెమన్'. ఇదొక కామెడీ ఎంటర్ టైనర్. ఓ విధంగా బోల్డ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. గురువారం సినిమా ట్రైలర్ విడుదలైంది. హీరో పెళ్లి చేసుకోకుండా పార్టీలు, పబ్బులు అంటూ నచ్చిన అమ్మాయిలతో తిరుగుతుంటాడు. ఒక రోజు అతడి దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి 'నేను నీ కూతురు'ని అంటుంది. ఆమె తల్లి పాత్ర టబు చేసింది. 'దే దే ప్యార్ దే' టైపులో బోల్డ్ క్యారెక్టర్ అన్నమాట. తెలుగులో క్యారెక్టర్స్ చేయడానికి టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... హిందీలో మాత్రం వయసుకు తగ్గ హీరోయిన్ పాత్రలే చేయాలని చూస్తున్నట్టు ఉన్నారు.
Also Read