ENGLISH | TELUGU  

నాతో అలా డాన్స్ చేయించిన క్రెడిట్ శేఖర్ మాస్టర్‌దే: మహేశ్

on Jan 9, 2020

 

"ఒక ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకురావడం, దానికో హీరోయిజం తేవడం.. నాట్ ఎ జోక్. అదే సమయంలో అది రెస్పాన్సిబుల్ క్యారెక్టర్. దాన్ని అనిల్ రావిపూడి తీర్చిదిద్దిన విధానం చూసి ప్రేక్షకులు అశ్చర్యపోతారు. ఇంతదాకా ఆయన తీసిన సినిమాలు ఒకెత్తు అయితే, ఇది ఇంకో ఎత్తు. ఒక దర్శకుడిగా పది రెట్లు అతను ఎదిగాడు" అని చెప్పారు మహేశ్. ఆయన హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసల జల్లు కురించారు మహేశ్.

"అనిల్ రావిపూడి ఈ కథను 'ఎఫ్2' జరిగేటప్పుడు 40 నిమిషాల్లో చెప్పారు. "చేస్తానండీ.. ఇంకో సినిమా కమిట్‌మెంట్ ఉంది" అనగానే ఆయన కూడా "నో ప్రాబ్లెం సార్. నేను కూడా 'ఎఫ్2' తర్వాత ఇంకో సినిమా చేస్తాను' అని చెప్పాడు. కానీ 'ఎఫ్2' చూడగానే నాకు ఇమ్మీడియేట్‌గా మా సినిమా చేద్దామనిపించింది. ఎందుకంటే అప్పటికే తను చెప్పిన లైన్ నన్ను ఎగ్జైట్ చేసింది. నేను కూడా 'శ్రీమంతుడు' నుంచి అన్నీ ఒక సపరేట్ జోనర్‌లో చేస్తూ వస్తున్నా. 'దూకుడు' తర్వాత ఆ తరహా సినిమా కోసం నా ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు, నేను కూడా చెయ్యాలనుకుంటున్నా. 'మహర్షి' తర్వాత ఇది చేస్తే బాగుంటుందనుకున్నా. ఐ టుక్ ద డిసిషన్. వెంటనే అనిల్ రావిపూడికి ఫోన్ చేశాను. 'ఏమైనా ముందు చెయ్యడానికి కుదురుద్దా' అనడిగాను. అతను చాలా హ్యాపీ ఫీలయ్యాడు. పూర్తి కథను 5 నెలల్లో రెడీ చేశాడు. జూలైలో సినిమా స్టార్ట్ చేశాం. ఇప్పుడు రిలీజ్‌కు వచ్చేశాం. ఈ టైంలో ఈ సినిమా చెయ్యడం నా కెరీర్‌లో తీసుకున్న బెస్ట్ డెసిషన్స్‌లో ఇదొకటి అనుకుంటున్నా. బొమ్మ అదిరిపోతుంది. సినిమాపై వెరీ వెరీ కాన్ఫిడెంట్. మా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆ సినిమా చేసేప్పుడు కానీ, చూసేప్పుడు కానీ, ఆ ఎగ్జైట్‌మెంట్ వైబ్స్ ఉన్నాయి. షూటింగ్ తొలి రోజు నుంచీ ఆ వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అదే వైబ్ ఫీలయ్యాను. జనం కూడా అదే వైబ్ ఫీలవుతున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ అనేది మా ఫీలింగ్.

'బిజినెస్‌మ్యాన్' తర్వాత నేను చేసిన ఫాస్టెస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాని జూన్‌లో స్టార్ట్ చేసి, సంక్రాంతికి వద్దామనుకున్నాం. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ సంక్రాంతి స్క్రిప్ట్. అందుకే ఈ సినిమా ముందు చెయ్యాలని నా యాంబిషన్. కాకపోతే జూలైలో షూటింగ్ స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఆర్మీ మేజర్ రోల్ కోసం నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఫిట్ లుక్‌లో కనిపించాలి. దాని కోసం కొంచెం టైం తీసుకున్నా. జూలైలో మొదలుపెట్టి నాన్-స్టాప్‌గా 125 రోజులు పనిచేశాం. ఎవరం పడుకోలేదు. నాకన్నా ఐదారు రోజులు రెస్ట్ ఇచ్చారు కానీ, మిగతా యూనిట్ రెస్ట్ లేకుండా పనిచేశారు. వాళ్ల ఎవర్ట్ లేకుండా ఈ సినిమా ఇంత ఫాస్ట్‌గా, ఇలా వచ్చేది కాదు. వాళ్లందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నా.

డైరెక్టర్‌తో ట్యూన్ కావడమనేది నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నేను డైరెక్టర్‌కు సరెండర్ అయిపోతే, అతను ఏం చెబితే అది చేస్తా. అనిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. దాంతో నా పని సులువైంది. మొదట నాలుగైదు రోజులు నాకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి రోల్ చేసి నేను చాలా రోజులైంది. 'దూకుడు' తర్వాత మళ్లీ అంతటి కమర్షియల్ ఫిల్మ్. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయడం మొదట నాలుగైదు రోజులు కష్టమనిపించింది. అలా అని మళ్లీ నేను 'దూకుడు'లా చెయ్యలేను. కమర్షియల్ మీటర్‌లో ఫ్రెష్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. దీని పూర్తి క్రెడిట్ డైరెక్టర్‌దే. అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉంటుంది. నా స్కిల్స్‌కు తగ్గట్లు క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు. నాపై ఒక మాస్ సాంగ్ చేద్దామని ఆయన కోరుకున్నాడు. ఈ సబ్జెక్టులో ఆ స్కోప్ ఉంది. మాస్ సాంగ్ చేశాం. నా చేత అలా డాన్స్ చేయించిన క్రెడిట్ శేఖర్ మాస్టర్‌దే.

ఈ సినిమాలో ఒక కొత్త మహేశ్‌బాబును చూస్తారు. నా క్యారెక్టర్ ఒక కొత్త డైమన్షన్‌లో, కొత్త టైమింగ్‌తో ఉంటుంది. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి' అనేవి చాల పవర్‌ఫుల్ స్టోరీస్. స్క్రిప్టుకు సరెండరై వాటిని చేశాను. అవన్నీ స్క్రిప్ట్ పరిధుల మేరకే చెయ్యాలి. మంచి స్క్రిప్ట్, ఫ్రీగా చేసే క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ఇది వచ్చింది. అనిల్ రావిపూడి కర్నూలులో ఈ కథ జరుగుతుందని చెప్పారు. అక్కడ కొండారెడ్డి బురుజు ల్యాండ్‌మార్క్. మా సినిమాలో అది కూడా ఒక క్యారెక్టర్. అదృష్టవశాతూ 'ఒక్కడు' కొండారెడ్డి బురుజు సీన్ ఒక ఐకానిక్ సీన్ అయిపోయింది. ఆ ఫీల్‌ను రిక్రియేట్ చేస్తే బాగుంటుందనిపించింది. కొండారెడ్డి బురుజును ఆర్ఎఫ్‌సీలో ఉన్నదున్నట్లు దింపేశాడు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్" అని చెప్పారు మహేశ్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.