కంటతడి పెట్టిన సాయి పల్లవి
on Jun 13, 2022

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'విరాట పర్వం'. 1990 లలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకుడు. సాయి పల్లవి ఈ మూవీలో వెన్నెల అనే ప్రధాన పాత్ర పోషించింది. ఆ పాత్ర చుట్టూనే సినిమా కథ తిరుగుతుంది. ఈ పాత్ర వరంగల్ కి చెందిన ఒక మహిళ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసినది. ఈ సినిమా కథ, సినిమాలోని వెన్నెల పాత్ర తన మనస్సుకి ఎంతో దగ్గరైందని చెబుతున్న సాయి పల్లవి.. తాజాగా సరళ కుటుంబాన్ని కలిసింది.

'విరాట పర్వం' సినిమాకి, వెన్నెల పాత్రకి స్ఫూర్తిగా నిలిచిన ఆ మహిళ కుటుంబాన్ని తాజాగా మూవీ టీమ్ కలిశారు. అందులో రానా, సాయి పల్లవి, వేణు ఊడుగుల ఉన్నారు. ఆ కుటుంబం సాయి పల్లవిని సొంత బిడ్డలా దగ్గరకు తీసుకొని ముచ్చటించింది. ఆ సమయంలో సాయి పల్లవి కంటతడి పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



