పొట్టి డ్రెస్ లు వేసుకోవద్దని ఆ క్షణమే డిసైడ్ అయ్యా
on Jun 13, 2022

హీరోయిన్స్ అంటేనే గ్లామర్. ఎక్కువగా పొట్టి దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. కానీ సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు మాత్రం ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కువగా సాంప్రదాయ వస్త్రాల్లోనే కనిపిస్తారు. ముఖ్యంగా సాయి పల్లవి లంగావోణీ, చీర కట్టుతో కట్టిపడేస్తుంది. అయితే సినిమాల్లోకి వచ్చి ఇంత గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి పొట్టి దుస్తులు వేయకపోవడం వెనక ఓ కారణముందట.
సాయి పల్లవి మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. జార్జియాలో చదువుకునే సమయంలో అక్కడ ఆమె టాంగో డాన్స్ నేర్చుకుంది. అయితే ఆ డ్యాన్స్ నేర్చుకోవాలంటే అందుకు తగ్గ డ్రెస్ వేసుకోవాలి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన సాయి పల్లవి తన తల్లిదండ్రుల అంగీకారంతో డ్యాన్స్ నేర్చుకుంది. అయితే మలయాళ మూవీ 'ప్రేమమ్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలో.. ఆమె టాంగో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి కొందరు చేసిన కామెంట్స్ మనస్సుకి బాధ కలిగించడంతో.. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులు వేసుకోకూడదని సాయి పల్లవి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

కాగా సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ 'విరాట పర్వం' జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా దగ్గుబాటి హీరోగా నటించిన ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



