`శ్యామ్ సింగ రాయ్`.. సాయిపల్లవి నెగటివ్ సెంటిమెంట్
on Jun 10, 2021

టాలీవుడ్ బాటపట్టిన కొత్తల్లో రెండు వరుస ఘనవిజయాలతో పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించింది సాయిపల్లవి. `ఫిదా`, `ఎంసీఏ` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ డాన్సింగ్ సెన్సేషన్.. ఆ తరువాత మాత్రం ఆ మ్యాజిక్ ని కొనసాగించలేకపోయింది. `కణం`, `పడి పడి లేచే మనసు`, `మారి 2`, `ఎన్జీకే`.. ఇలా సాయిపల్లవి నాయికగా భారీ అంచనాల నడుమ విడుదలైన బైలింగ్వల్, స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. మరీముఖ్యంగా.. సాయిపల్లవి కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలుస్తుందనుకున్న `పడి పడి లేచే మనసు`.. ఊహాతీత ఫలితాన్ని చూసింది.
ఈ నేపథ్యంలో.. రాబోయే `లవ్ స్టోరి`, `విరాట పర్వం`, `శ్యామ్ సింగ రాయ్`చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది సాయిపల్లవి. వీటిలో `లవ్ స్టోరి`, `విరాట పర్వం` విడుదలకు సిద్ధం కాగా.. `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూడింటిలోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో నటిస్తోంది పల్లవి. ఇదిలా ఉంటే.. `పడి పడి లేచే మనసు` తరహాలోనే `శ్యామ్ సింగ రాయ్`లోనూ బెంగాలీ అమ్మాయిగా దర్శనమివ్వనుంది సాయిపల్లవి. మరి.. `పడి పడి లేచే మనసు` నిరాశపరిచిన నేపథ్యంలో.. అదే కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న `శ్యామ్ సింగ రాయ్` అయినా పల్లవి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



