బురఖా ధరించి సినిమాకి వెళ్లిన సాయి పల్లవి.. గుర్తుపట్టని ప్రేక్షకులు!
on Dec 29, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. డిసెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల రియాక్షన్ తెలుసుకోవడం కోసం తాజాగా సాయి పల్లవి బురఖా ధరించి ఓ థియేటర్ కి వెళ్ళింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మొదటి నుంచి నటనా ప్రాధాన్యమున్న సినిమాలు ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి.. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో నటిగా మరో మెట్టెక్కింది. ఆమె నటనకి, నాట్యానికి చప్పట్ల వర్షం కురుస్తోంది. మూవీకి, తన పాత్రకి వస్తున్న రెస్పాన్స్ కి ప్రత్యక్షంగా చూడాలని భావించిన సాయి పల్లవి డైరెక్టర్ రాహుల్ తో కలిసి తాజాగా హైదరాబాద్ భరత్ నగర్ లోని శ్రీరాములు థియేటర్ కి వెళ్లింది. మాములుగా వెళ్తే తనని ప్రేక్షకులు గుర్తుపట్టి చుట్టుముడతారని భావించిన ఆమె.. బురఖా ధరించి వెళ్లింది.

సాయి పల్లవి బురఖా ధరించి శ్రీరాములు థియేటర్ లో 'శ్యామ్ సింగ రాయ్' మూవీ చూసిన విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ వీడియోని విడుదల చేశారు. ఆమె బురఖా ధరించి థియేటర్ లోకి వెళ్లడం వీడియోలో కనిపించింది. థియేటర్ లో ఆమె పక్కన డైరెక్టర్ రాహుల్ ఫేస్ కి మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. థియేటర్ లో మూవీకి, ఆమె పాత్రకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి సాయి పల్లవి మురిసిపోవడం వీడియోలో కనిపించింది. మూవీ అయిపోయి థియేటర్ నుండి బయటకి వస్తుండగా 'మూవీ ఎలా ఉంది?' అని అడగగా.. బురఖాలో ఉన్న సాయి పల్లవి సమాధానం చెప్పకుండా నవ్వుకుంటూ బయటకు వచ్చింది. తర్వాత తన ఫేస్ రివీల్ చేసి కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే బురఖాలో ఉంది సాయి పల్లవి అని తర్వాత తెలుసుకున్న ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



