2021 జ్ఞాపకాలుః జనవరి - డిసెంబర్ టాలీవుడ్ హిట్స్ ఇవే!
on Dec 29, 2021

2021 క్యాలెండర్ ఇయర్ లో అటు థియేటర్స్ లోనూ, ఇటు ఓటీటీ వేదికల్లోనూ 150కి పైగా తెలుగు చిత్రాలు జనం ముందు నిలిచాయి. ఒక్క జూన్ మినహాయిస్తే ప్రతీ నెలలోనూ ప్రజాదరణ పొందిన సినిమాలుండడం విశేషం. నెలల వారీగా ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..
జనవరిః- ఈ నెలలో మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలవగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన `రెడ్` ఓకే అనిపించుకుంది. ఇక నెలాఖరులో వచ్చిన ప్రదీప్ మాచిరాజు `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?` కూడా విజయతీరాలకు చేరింది.
ఫిబ్రవరిః- ఈ నెలలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన `ఉప్పెన` సంచలన విజయం సాధించగా.. `అల్లరి` నరేశ్ నటించిన `నాంది` కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది. అలాగే తేజ సజ్జ `జాంబి రెడ్డి` చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
మార్చిః- హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన `జాతిరత్నాలు` మార్చి నెలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇందులో టైటిల్ రోల్స్ లో ఎంటర్టైన్ చేశారు.
ఏప్రిల్ః- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్` ఏప్రిల్ నెలలో రిలీజై వసూళ్ళ వర్షం కురిపించింది.
మేః- ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `సినిమా బండి` వీక్షకాదరణ పొంది.. మే నెల హిట్ మూవీగా నిలిచింది.
జూలైః- విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్ లో నటించిన `నారప్ప` ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి వీక్షకాదరణ పొందింది. ఇక సత్యదేవ్ నటించిన `తిమ్మరుసు` థియేటర్స్ లో ఓకే అనిపించుకుంది.
ఆగస్టుః- ఈ నెలలో రిలీజైన శ్రీ విష్ణు `రాజ రాజ చోర`, కిరణ్ అబ్బవరం `ఎస్ ఆర్ కళ్యాణమండపం` సక్సెస్ ఫుల్ మూవీస్ గా నిలిచాయి.
సెప్టెంబర్ః- నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్ స్టోరి` సెప్టెంబర్ సెన్సేషన్ గా నిలవగా.. గోపీచంద్, తమన్నా జోడీగా ఎంటర్టైన్ చేసిన `సీటీమార్` కూడా జనాదరణ పొందింది.
అక్టోబర్ః- దసరా స్పెషల్ గా అక్టోబర్ లో విడుదలైన అఖిల్ - పూజా హెగ్డే సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` హిట్ లిస్ట్ లో చేరగా.. అదే రోజు జనం ముందు నిలిచిన రోషన్ - శ్రీలీల జోడీ మూవీ `పెళ్ళి సందడి` మ్యూజికల్ హిట్ అనిపించుకుంది.
నవంబర్ః- ఈ నెలలో విక్టరీ వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన `దృశ్యం 2` ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి వీక్షకాదరణ పొందింది.
డిసెంబర్ః- 2021 సంవత్సరాంతం తెలుగు చిత్ర పరిశ్రమకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటించిన `అఖండ` సెన్సేషనల్ హిట్ గా నిలవగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప - ద రైజ్`, నేచురల్ స్టార్ నాని `శ్యామ్ సింగ రాయ్` కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తూ విజయపథంలో పయనిస్తున్నాయి.
ఓవరాల్ గా.. 2021లో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



