బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇస్తున్న లారెన్స్!
on Feb 9, 2023

బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇస్తూ స్పీడున్నోడు అని అనిపించుకుంటున్నారు రాఘవ లారెన్స్. ఆయన హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రుద్రన్. ప్రియా భవానీ శంకర్ నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తమిళ ఉగాదికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని లాస్ట్ ఇయర్ విడుదల చేశారు. లారెన్స్ కొత్తగా ఉన్నారంటూ ప్రశంసలు దక్కాయి. రుద్రన్‌కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ పాట ఓ పాపులర్ సాంగ్‌కి రీమిక్స్ వెర్షన్ అనే టాక్ ఉంది. రుద్రన్ సినిమా తన కాంచన సీరీస్‌లాగా తప్పకుండా క్లిక్ అవుతుందన్నది లారెన్స్ వెర్షన్. మరోవైపు ఆయన చంద్రముఖి2లో నటిస్తున్నారు. పి.వాసు డైరక్షన్ చేస్తున్న సినిమా ఇది. కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రజనీకాంత్ రోల్‌లో రాఘవ లారెన్స్, చంద్రముఖిగా కంగన కనిపిస్తారు. అడపాదడపా డ్యాన్స్ మాస్టర్‌గానూ పెద్ద హీరోల సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేయాలని అనుకుంటున్నారట రాఘవ లారెన్స్. చెన్నైలో లారెన్స్ పెద్ద గుడి కట్టారనే విషయం తెలిసిందే. దాంతో పాటు ఎంతో మంది పిల్లలను చేరదీసి వారిని పోషిస్తూ, చదువులు చెప్పిస్తున్నారు లారెన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



