శంకర్ దృష్టిలో బ్యాడ్ అయిన సూర్య!
on Jun 6, 2023
శంకర్ ఇప్పుడు ఒకటికి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పాతికేళ్లకు పైబడిన ఇండియన్ మూవీ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఒకటికి రెండు సినిమాలు చేస్తున్నప్పుడు, రెండిటిలోనూ విలన్లు కావాలి. మరి అలాంటప్పుడు ఆయన తెలుగు మూవీ కోసం ఎస్.జె.సూర్యని సెలక్ట్ చేసుకున్నారు. మరి ఇండియన్2 కోసం ఎవరు వచ్చారు? ఇండియన్2 లోనూ ఎస్.జె.సూర్యనే విలన్ అట. ఇండస్ట్రీలో మల్టీటాలెంటెడ్ పర్సనాలిటీల్లో ఎస్.జె.సూర్య ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారు. సర్‌కాస్టిక్ కామెడీతో పాటు, విలనిజం కూడా ఆయన స్పెషల్. ఇప్పుడు దాన్నే వాడుకుంటున్నారట శంకర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ అన్ని సినిమాల పేర్లూ చెప్పిన సూర్య, ఇంకో భారీ బడ్జెట్ సినిమా ఉంది. అది ప్రస్తుతానికి సస్పెన్స్ అనేశారు. అంతలోనే కమల్‌హాసన్‌తో తనకున్న రిలేషన్‌ని త్వరలోనే రివీల్ చేస్తానని మరో చోట అన్నారు. వాటన్నిటినీ గమనించిన ఫ్యాన్స్ కమల్ మూవీలో ఎస్.జె.సూర్య నటిస్తున్నారంటూ గెస్ చేశారు. ఇప్పుడు అది నిజమని క్లారిటీ వచ్చేసింది.
ఇండియన్2 మూవీలో ఎస్.జె.సూర్య కేరక్టర్ చాలా బాగా వచ్చిందట. ఉలగనాయగన్ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అయ్యేలా ఉంటాయట సన్నివేశాలు. అందులోనూ కమల్, సూర్య కలిసే షాట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు యూనిట్ మెంబర్స్. సూర్య నటిస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచాలని అనుకున్నారట శంకర్. అందుకే ఇన్నాళ్లూ చెప్పలేదట. ఇప్పుడు సూర్య పోర్షన్ కంప్లీట్ అయింది. ఇండియన్ సినిమాతో పోల్చుకుంటే భారతీయుడు2 పది రెట్లు గొప్పగా ఉంటుందని అన్నారు సిద్ధార్థ్. ఇండియన్2 గురించి వీళ్లు చెబుతున్న మాటలు సినిమా మీద హైప్ పెంచుతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
