మీ వైఫ్ బాయ్ ఫ్రెండ్ తో మీరు లైఫ్ షేర్ చేసుకుంటారా!
on Jun 6, 2023
ఈ మధ్య మూవీ ప్రొమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఒక్కో సారి హీరో హీరోయిన్స్ చేస్తారు...కొన్నిటికి డైరెక్టర్స్ చేస్తారు. ఏదేమైనా ప్రమోషన్ లో ఒక యూనిక్ నెస్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి కొత్తదనంతో తమ మూవీకి ప్రమోషన్ చేసుకుంటున్నారు ఆట సందీప్-జ్యోతిరాజ్. ఆ ప్రమోషన్ వీడియోని తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. కార్ డ్రైవ్ చేస్తూ సందీప్ ఈ వీడియో తీసాడు. వెనక తన వైఫ్ జ్యోతిరాజ్ కూర్చుని ఏం చెప్తున్నాడా అని సీరియస్ గా చూస్తోంది. అప్పుడు సందీప్ "పెళ్లయ్యాక లవ్ చేయకూడదు అనే రూల్ లేదు...వి కెన్ లవ్ ఎనీవన్. లవ్ చేయొచ్చు...ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. జెన్యూన్ గా ఉండొచ్చు. అదే నేను చెప్తోంది ఏంటంటే ఏ విషయం ఉన్నా నేను ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటా. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది..మన ముగ్గురం కలిసి హ్యాపీగా ఒక ఇంట్లో ఉందాం" అని నా వైఫ్ తో చెప్తాను అని జ్యోతి వంక చూసేసరికి ఆమె సీరియస్ గా ఆ వీడియోని ఆపేసింది.
జూన్ 16 న "లవ్ యు టూ" మూవీ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ పై రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇలా తమ మూవీని ప్రమోట్ చేసుకుంటున్నారు. సందీప్ చేసిన ఈ వీడియోకి ఒక నెటిజన్ ఘాటుగా ఒక ప్రశ్న అడిగింది "మీ వైఫ్ కి బాయ్ ఫ్రెండ్ వున్నా ఓకే నా మీకు..? తన బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ షేర్ చేస్కుంటారా మీరు …?అని ...ఏం మెసేజ్ ఇస్తున్నారు సర్ సమాజానికి...మూవీ ప్రమోషన్ నైస్ ఐడియా...అక్క చీపురు కట్ట తీస్తుంది జాగ్రత్త" అని కామెంట్స్ పెడుతున్నారు.
అట సందీప్ డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించాడు. ఇప్పుడు "లవ్ యు టూ" మూవీలో తన భార్య జ్యోతితో కలిసి నటించాడు. ఈ మూవీలో సందీప్ కి జ్యోతి వైఫ్ గా యాక్ట్ చేసింది. పెళ్లయ్యాక మరో అమ్మాయితో ప్రేమలో పడిన ఒక డాన్సర్ తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసాడో ఈ మూవీలో చూడొచ్చు. కొన్నేళ్ల క్రితం ఆట, ఛాలెంజ్ షోస్ మంచి ఫేమస్. అప్పట్లో వచ్చిన ఆట ఫస్ట్ సీజన్ విన్నర్ గా సందీప్ నిలిచేసరికి షో పేరే తన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత తన తోటి డ్యాన్సర్ అయిన జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మూవీస్ కి , ఈవెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉన్నారు ఈ జంట.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టాలో రీల్స్ తో పాటు యూట్యూబ్ లో వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఆడియన్స్ ని పెంచుకుంటూ ఉంటారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
