చైతూ - జ్యోతిక: ఆ సినిమా లేదట!
on Jun 6, 2023
ఉత్తరాదిన క్లిక్ అయిన చిన్న సినిమాల్లో భూల్ భులయ్య2 ఒకటి. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించారు. చాలా మంచి పేరు, కలెక్షన్లుతెచ్చుకుంది ఈ సినిమా. లేటెస్ట్ గా సేమ్ జోడీ నటించిన సత్యప్రేమ్‌కీ కథ చిత్రం ట్రైలర్ రిలీజ్ కావడంతో మరోసారి ఓల్డ్ మూవీ ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. నార్త్ లో ఈ పేరుతో ట్రెండ్ అవుతుంటే, సౌత్‌లో మాత్రం మరో రీజన్‌తో ట్రెండ్ అవుతోంది ఈ సినిమా. రీసెంట్‌గా కస్టడీ సినిమా చేశారు నాగచైతన్య. వెంకట్ ప్రభు డైరక్షన్‌లో చేసిన ఆ సినిమా హిట్ కాలేదు. దీంతో డీలా పడిపోకుండా, నెక్స్ట్ ఏంటని ఆలోచించడం మొదలుపెట్టారనే వార్తలు వచ్చాయి. భూల్ భులయ్య2లో టిస్తున్నారనే వార్తలు కూడా అందులో భాగంగా వచ్చినవే. ఈ సినిమాలో కార్తిక్ చేసిన కేరక్టర్‌ని ఇక్కడ చైతన్య చేస్తారనే టాక్స్ వినిపించాయి. చైతూ తో పాటు జ్యోతిక కూడా ఈ మూవీ చేస్తారని అన్నారు. వావ్.. అప్పుడెప్పుడో నాగార్జున పక్కన జ్యోతికను చూశాం. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు సేమ్ కాంపౌండ్‌లో చూస్తామని అనుకుంటుంటే థ్రిల్లింగ్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే వారి ఆశలు మీద నీళ్లు జల్లే వార్త ఒకటి పిడుగులా పడింది.
నాగచైతన్య భూల్ భులయ్య2లో చేయడం లేదు. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి అంటూ చైతూ టీమ్ స్పందించింది. అయితే గతంలో ఓ సారి స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమా గురించి ప్రస్తావించింది. భూల్ భులయ్య2 సౌత్ హక్కులు మా దగ్గరున్నాయి. సౌత్ కల్చర్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి మంచి హీరోతో సినిమా చేస్తాం. అలాగని ఒరిజినల్ స్టోరీని మార్చబోం అని జ్ఞానవేల్ రాజా అన్నారు. అప్పటి స్టేట్‌మెంట్‌ని, ఇప్పటి వైరల్ న్యూస్‌ని జతచేసి, సూర్య కజిన్ ప్రొడక్షన్ హౌస్‌లో చైతూ అంటూ వార్తలొచ్చాయి. ఫాల్స్ న్యూస్ అని తేలిపోయిందనుకోండి... అయినా చైతూ, జో ఒకే సినిమాలో అనే ఊహ మాత్రం అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
