మెగా హీరోల పరువు తీసిన... సైమా
on Jun 17, 2015

సంపూతో మెగా హీరోలు పోటీ పడితే ఎలా ఉంటుంది?? అందులోనూ ఓ అవార్డు కోసం..?? సంపూ రేంజు పెరిగిందనుకోవాలా, లేదంటే మెగా హీరోల స్థాయి దిగజారిందనుకోవాలా?? అనే ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. అలా మెగా హీరోలతో `సైమా` ఆటాడేసుకొంది. టోటల్‌గా మెగా ఫ్యామిలీ పరువు తీసింది. దక్షిణాదిన సినిమా రంగానికి సంబంధించి ప్రతి ఏడాదీ ‘సైమా’ అవార్డ్స్ ని ఇస్తోంది.
2014 సంవత్సరానికి గానూ సైమా తన నామినీ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టు చూసి మెగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఎందుకంటే బెస్ట్ డెబ్యూ హీరోల లిస్టులో సాయి ధరమ్ తేజ్ (పిల్లా నువ్వు లేని జీవితం), వరుణ్ తేజ్ (ముకుంద) పేర్లు కనిపించాయి. ఆ పక్కనే సంపూర్ణేష్ బాబు (హృదయకాలేయం) పేరు ఉండడం...మెగా ఫ్యాన్స్‌ని విస్మయపరిచింది. ఈ అవార్డు కోసం సంపూతో వీళ్లు పోటీ పడాలా?? అంటూ ముక్కున వేలేసుకొంది.
ఒక వేళ సంపూకే ఈ అవార్డు దక్కితే తమ హీరోల పరువేంగానూ.. అంటూ మెగా ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. ఈ వేడుకకు మెగా హీరోలు హాజరవుతారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి మెగా హీరోలు దీన్ని తమ ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకొంటారో, లేదంటే స్పోర్టీవ్‌గా వ్యవహరిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



