నాగార్జునకు నచ్చలేదు!
on Jun 17, 2015
.jpg)
మనం తరవాత నాగార్జున సినిమాఏదీ రాలేదు. సోగ్గాడే చిన్ని నాయినా ఎప్పుడో మొదలైనా, ఆ సినిమా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం నాగ్ కార్తితో సినిమాతప్ప మరో ప్రాజెక్టులూ ఒప్పుకోలేదు. పెద్దగా షూటింగుల హడావుడీ లేవు. సోగ్గాడే చిన్ని నాయిన షూటింగ్‌కి నిరవధికంగా బ్రేక్ ఇచ్చేశాడు నాగ్. అయితే ఏం జరుగుతున్నట్టు..?? సోగ్గాడేని ఎందుకు పక్కన పెట్టేసినట్టు? అనే అనుమానాలు అటు నాగ్ అభిమానుల్లోనూ, ఇటు టాలీవుడ్ వర్గాల్లోనూ వ్యక్తం అవుతున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. `సోగ్గాడే చిన్ని నాయినా` సినిమా ఆగిపోయిందని టాక్. ఈ సినిమా రషెస్ చూసిన నాగ్... పూర్తి అసంతృప్తితో ఉన్నాడట. కథ అనుకొన్నది అనుకొన్నట్టు రాలేదని.. ఫీలౌతున్నాడట. దర్శకుడు చెప్పిన లైన్ బాగానే ఉన్నా, సరిగా టేకప్ చేయలేకపోయాడని, సీన్లు సరిగా రాలేదని నాగ్ భావిస్తున్నాడట. అందుకే అర్థాంతరంగా ఈ సినిమాని ఆపేశాడని తెలుస్తోంది. తీసిన సన్నివేశాల్లో చాలామట్టుకు రీషూట్ చేయాలని చూస్తున్నాడు నాగ్. అందుకే ఆయా సన్నివేశాల్ని మళ్లీ తిరగరాయిస్తున్నాడట. ఈ సీన్లు సంతృప్తికరంగా వస్తే షూటింగ్ చేద్దామని, లేదంటే సినిమానే ఆపేద్దామని దర్శకుడు కల్యాణ్‌కి వార్నింగ్ ఇచ్చాడట నాగ్. దాంతో కల్యాణ్ హడావుడిగా.. సీన్లు మళ్లీ రాసే పనిలో పడ్డాడట. మరి కల్యాణ్ ఈ కింగ్‌ని ఎప్పుడు ఒప్పిస్తాడో, ఎప్పుడు ఈ సినిమాని మళ్లీ పట్టాలెక్కిస్తాడో అనేది అనుమానంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



