ఆ 18 నిమిషాలూ మహేష్ కనిపించడా??
on Jun 17, 2015
.jpg)
టైటిల్స్ అయిపోయి తెరపై బొమ్మ పడగానే.. మనకు హీరో కనిపించాల్సిందే. లేదంటే... మనసొప్పుకోదు. అభిమాన కథానాయకుడ్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ గుండెలు ఉప్పొంగిపోతాయి. సో.. దర్శకులు కూడా రెండో సీన్‌లోనో, మూడో సీన్‌లోనో హీరోని ఓ భారీ సెటప్ మధ్య చూపించేస్తారు. అయితే `శ్రీమంతుడు` మాత్రం ఈ థీరికీ విరుద్ధంగా వెళ్లబోతోందని టాలీవుడ్ వర్గాల టాక్.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... `శ్రీమంతుడు`లో తొలి 18 నిమిషాలూ మహేష్ కనిపించడట. ఫ్లాష్ బ్యాక్‌లో చిన్నప్పటి ఎపిసోడ్స్ సాగుతాయట. ఆ తరవాతే అసలు కథ మొదలవుతుందని, మహేష్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. కథకు సంబంధించినంత వరకూ ఆ ఎపిసోడ్ చాలా కీలకమని.. అందుకే మహేష్‌ని చూపించలేకపోతున్నారని తెలుస్తోంది. ఓ కమర్షియల్ సినిమాలో అంత సేపు హీరోని దాచడం సేఫ్ కాదు. ఆడియన్స్ నిరుత్సాహపడితే... సినిమా ఫలితం తారుమారు అవుతుంది. అందుకే ఈ విషయంపై చిత్రబృందం మరోసారి దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కుదించి, 10 నిమిషాలకు తీసుకొచ్చే ఛాన్సులున్నాయా అనేది ఆలోచిస్తోందట. అలాగైనా తొలి పది నిమిషాలూ.. ప్రిన్స్ అభిమానులకు కనిపించడు. ఆ పదినిమిషాలైనా దర్శకుడు ఎలా మేనేజ్ చేస్తాడనేదాన్ని బట్టి, ఫ్యాన్స్ రియాక్షన్ ఆధారపడి ఉంటుంది. మరి కొరటాల శివ ఏం చేస్తాడో, ఏంటో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



