మొన్న కొరటాల.. నిన్న చందు.. నేడు వివేక్ ఆత్రేయ!
on Jun 9, 2022

విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. రీసెంట్ గా `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్`, `సర్కారు వారి పాట` చిత్రాలతో ఎంటర్టైన్ చేసిన ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌస్.. రేపు (జూన్ 10) `అంటే.. సుందరానికీ!`తో వినోదాలు పంచనుంది. నేచురల్ స్టార్ నాని, కేరళ కుట్టి నజ్రీయా ఫాహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా రూపొందింది.
ఇదిలా ఉంటే, దర్శకుల హ్యాట్రిక్ ప్రయత్నాలకు మైత్రీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుండడం వార్తల్లో నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. `మిర్చి`, `శ్రీమంతుడు` తరువాత కొరటాల డైరెక్ట్ చేసిన మూడో చిత్రం `జనతా గ్యారేజ్`ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. `కార్తికేయ`, `ప్రేమమ్` తరువాత చందు మొండేటి మూడో ప్రయత్నం `సవ్యసాచి`ని కూడా మైత్రీనే ప్రొడ్యూస్ చేసింది. కట్ చేస్తే.. `మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా` అనంతరం దర్శకుడు వివేక్ ఆత్రేయ హ్యాట్రిక్ ఎటెంప్ట్ అయిన `అంటే.. సుందరానికీ!`ని కూడా మైత్రీనే నిర్మించడం విశేషం. మరి.. కొరటాల శివలాగా వివేక్ ఆత్రేయ కూడా హ్యాట్రిక్ కొడతాడో లేదంటే చందు మొండేటిలాగా హ్యాట్రిక్ మిస్సవుతాడో తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



