సంక్రాంతి బరిలో కొత్త పందెం కోళ్లు
on Jan 13, 2022
సంక్రాంతి పండగ సమయంలో సినిమాల సందడి ఉండటం సహజం. అయితే ఈ సంక్రాంతికి ఇద్దరు వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారిలో ఒకరు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ కాగా, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బాయ్స్'. ఈ సినిమాతో శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనువిందు చేయనున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక గల్లా అశోక్ విషయానికి వస్తే సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కి హీరోగా పరిచయమవుతున్నాడు. గల్లా అశోక్ ఓ వైపు తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడిగా.. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడిగా 'హీరో' అనే సినిమాతో జనవరి 15 న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న 'హీరో' సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.
సంక్రాంతి బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ వారసులు మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
