వాల్తేరు వీరయ్య లో సముద్రానికి రాజును నీనే!
on Jan 11, 2023

ఇది వరకు తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేసిన పలువురు నటీనటులు ఆ తర్వాత పెద్ద పేరును తెచ్చుకుని నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇందులో విలన్ అజయ్ నుంచి సోనూసూద్ ఎందరినో ఉదాహరణగా చెప్పుకోవాలి. అజయ్ కెరీర్‌ని రాజమౌళి చిత్రాలు పెద్ద మలుపు తిప్పాయి. ఇక ఇదే కోవలోకి పలువురు నటీనటులు వస్తారు. నిఖిల్ నుంచి అనసూయ వరకు దీనికి ఎందరో నిదర్శనం. కాగా తెలుగు ప్రేక్షకులకు రోహిత్ పాఠక్ చిన్న చిన్న వేషాలు విలన్ పాత్రల ద్వారా పరిచయం. తేజా దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన సీత, నితిన్ -చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో వచ్చిన చెక్, గోపీచంద్ హీరోగా వచ్చిన సిటీ మార్, కార్తీ హీరోగా వచ్చిన ఖాకీ, రామ్ నటించిన వారియర్ వంటి చిత్రాలలో ఆయన కొన్ని పాత్రలు చేశారు. తాజాగా ఆయన వాల్తేరు వీరయ్యలో ఓ పాత్రను చేస్తున్నారు. ఈ పాత్ర తన కెరీర్ ను మలుపు తిప్పుతుందనే ఆశతో ఆయన ఉన్నారు.
వాల్తేరు వీరయ్య చిత్రంలో ఆయన కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడిన తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ నేను మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించాను. చిరంజీవి మొదటి పోరాట సన్నివేశం నుంచే నా పాత్ర మలుపు తిరుగుతుంది. సముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తుంటాను. ఒక రకంగా చెప్పాలంటే సముద్రానికి రాజును. ఈ సినిమాలో నాది బంగ్లాదేశ్. తీర ప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తిని. చిరంజీవి పరిచయ సన్నివేశంలో నేను భాగమవుతాను. నాకు హీరోకు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి... అన్నారు. ఇక ఆయన మాట్లాడుతూ తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరు టాప్ హీరోలు. సంక్రాంతికి వారి చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. ఇద్దరు నటించిన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇద్దరూ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలోని మాస్ ప్రేక్షకులు సంక్రాంతి లో పండగలు వీరి సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు అని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్‌ల ముఖ్య పాత్రలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 13న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు మరల ముఠామేస్త్రి నాటి వింటేజ్ లుక్ లో కనిపిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



