ఎన్టీఆర్ నటనా ప్రతిభను ఒక్క ముక్కలో చెప్పేసిన రాజమౌళి!
on Jan 11, 2023

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళిల కెరీర్ దాదాపు అటు ఇటుగా ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ నటించిన రెండో చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ తో రాజమౌళి దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వారిద్దరి కాంబినేషన్‌లో సింహాద్రి, యమదొంగ చిత్రాలు వచ్చాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక రాజమౌళి ఎన్టీఆర్‌లు చాలా మంచి స్నేహితులు. రాజమౌళికి జక్కన్న అనే మారుపేరును, ముద్దు పేరును పెట్టింది ఎన్టీఆరే.
జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే నటనలో, డైలాగ్ చెప్పడంలో, డాన్స్ చేయడంలో ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆయనది అందెవేసిన చెయ్యి. ఎంతమంది స్టార్లు ఉన్నా ఎన్టీఆర్ నటన ప్రతిభ, డాన్సింగ్ స్కిల్స్ ముందు సరిపోరనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు సృష్టించింది. అందరి ప్రశంసలు పొంది ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఆస్కార్ ఓటింగ్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనికి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. స్క్రీనింగ్ అనంతరం వీరిద్దరూ అక్కడ మీడియాలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రాజమౌళితో చేసిన సినిమాలే. రాజమౌళి తెలుగు పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కేలా చేశారు. నాటు నాటు పాటకు మేం పడిన కష్టం ఆ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మైమరిచిపోయాం... అన్నారు. ఇక రాజమౌళి మాట్లాడుతూ కొమరం భీముడో సాంగ్ నాకు చాలా ఇష్టం. నేను దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఇదే నా ఫేవరేట్ సాంగ్.
ఈ పాటలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ కనుబొమ్మలపై మనం కెమెరా పెడితే వాటితో నటించగలడు అన్నారు. గతంలో ఇదే విషయంపై సీనియర్ నటి కుష్బూ తో పాటు పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్కు ఇదే కితాబునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా రోజు రోజుకి బాగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన దేశం గర్వించదగ్గర ఎంతైనానటుడు కావడంలో సందేహం లేదు. దానికి తోడు రాజమౌళి వంటి మరికొందరు దర్శకులు ఆయనకు దొరికితే ఆయన ప్రతిభ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



