కరోనా దెబ్బకు జేమ్స్ బాండ్ భయపడ్డాడు
on Mar 5, 2020

కరోనా దెబ్బకు జేమ్స్ బాండ్ భయపడ్డాడు. కరోనా ధాటికి ఏమైపోతానోనని వెనకడుగు వేశాడు. కరోనా తగ్గు ముఖం పట్టేవరకూ ఆగి ఆలస్యంగా తన ముఖాన్ని ప్రేక్షకులకు చూపించాలని డిసైడ్ అయ్యాడు. ప్రపంచ సినిమాపై కరోనా ఏవిధమైన ప్రభావం చూపిస్తుందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో జేమ్స్ బాండ్ అంతటి సాహసికుడు మరొకరు లేరనే విధంగా బాండ్ చిత్రాల్లో యాక్షన్ దృశ్యాలను రూపొందిస్తారు. అటువంటి బాండ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆపేసింది కరోనా.
జేమ్స్ బాండ్ సిరీస్‌లో తెరకెక్కిన 25వ సినిమా 'నో టైమ్ టు డై'. జేమ్స్ బాండ్ పాత్రలో ఐదోసారి డేనియల్ క్రేగ్ నటించిన సినిమా. దీని తర్వాత అతడు బాండ్ పాత్ర చేయనని చెప్పాడు. ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు చేయడం లేదు. నవంబర్ నెలకు వాయిదా వేశారు. దీనికి కారణం కరోనా. హాలీవుడ్ సినిమాలకు చైనాలో మంచి మార్కెట్ ఉంది. బాండ్ సినిమాలకు అక్కడ మంచి వసూళ్లు వచ్చాయి. కరోనా వల్ల చైనాలో చాలా థియేటర్లు మూతపడ్డాయి. చైనాలో 'నో టైమ్ టు డై' విడుదల కాకపోతే సుమారు 100 మిలియన్ డాలర్లు లాస్. అందుకని, సినిమాను వాయిదా వేశారు. నవంబర్ నాటికి కరోనా తగ్గుముఖం పట్టవచ్చని ఆశిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేస్తున్నట్టు బాండ్ నిర్మాతలు తెలిపారు. యూకేలో నవంబర్ 12న, అమెరికాలో 25న సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



