కామెడీ ఫైట్... అఖిల్‌కి గాయం
on Mar 5, 2020

కామెడీ ఫైట్... థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు వచ్చేలా ఒక ఫైట్ తీస్తున్నారు. అఖిల్ అక్కినేని 100 పర్సెంట్ సీరియస్‌గా ఫైట్‌లో యాక్షన్ చేశారు. డూప్ గట్రా లేకుండా పాల్గొన్నారట. ఒక సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కుడి మోచేతికి బలమైన గాయం తగిలిందని తెలిసింది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. కామెడీ ఫైట్ తీస్తున్నప్పుడు గాయం కావడంతో వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని అఖిల్ కి చెప్పారట. దాంతో కొన్ని రోజులు షూటింగ్ కి సెలవు ప్రకటించారు. ప్రస్తుతం అఖిల్ ఇంటికి పరిమితమయ్యారు. మార్చి 10 నుండి మళ్లీ షూటింగులో జాయిన్ అవుతారని సమాచారం.
అఖిల్ ఎన్నారైగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈమధ్య సిద్ శ్రీరామ్ పాడిన 'మనసా మనసా' పాటను విడుదల చేశారు. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



