వేసవి బరిలో రవితేజ `ధమాకా`!
on Dec 7, 2021
వరుస చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం రవితేజ చేతిలో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` సినిమాలున్నాయి.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 11న `ఖిలాడి`, మార్చి 25న `రామారావు ఆన్ డ్యూటీ`.. ఇలా రెండు వరుస నెలల్లో రెండు చిత్రాలతో ఎంటర్టైన్ చేయనున్న రవితేజ.. వేసవిలో మరో సినిమాతో సందడి చేయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `నేను లోకల్` కెప్టెన్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో `ధమాకా` పేరుతో రవితేజ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. `పెళ్ళి సందడి` ఫేమ్ శ్రీలీల నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అంతేకాదు.. ఏప్రిల్ నెలాఖరుకల్లా ఈ సినిమా నిర్మాణం పూర్తయ్యే అవకాశముందంటున్నారు. అలాగే, వేసవి కానుకగా మే ద్వితీయార్ధంలో లేదా జూన్ ప్రథమార్ధంలో `ధమాకా`ని థియేటర్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ వచ్చేసింది!
మొత్తమ్మీద.. నాలుగు నెలల వ్యవధిలో మాస్ మహారాజా నుంచి మూడు చిత్రాలు రాబోతుండడం అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
