షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. అయినా తగ్గేదేలే!
on Jun 17, 2022

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో 'టైగర్ నాగేశ్వరరావు' ఒకటి. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ రూపొందిస్తున్న ఈ సినిమాకి వంశీ కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా షూట్ లో తాజాగా రవితేజ గాయపడినట్లు తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్ పని చేస్తున్నాడు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. రోప్ జారి రవితేజ గాయాల పాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు పది కుట్లు పడినట్లు సమాచారం. అయితే పీటర్ హెయిన్ తో పాటు మిగతా ఫైటర్స్ డేట్స్ వేస్ట్ చేయడం ఇష్టంలేని రవితేజ.. ఇంకా పూర్తిగా కోలుకోకుండానే తిరిగి రెండు రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



