సమంత వర్సెస్ చైతన్య.. వెనక్కి తగ్గుతున్న అఖిల్!
on Jun 17, 2022

ఆగష్టు రెండో వారంలో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ముఖ్యంగా మూడు సినిమాలపై ప్రేక్షకుల దృష్టి ఉంది. అవే 'లాల్ సింగ్ చద్దా', 'యశోద', 'ఏజెంట్'. అయితే ఇప్పుడు ఈ త్రిముఖ పోరు నుంచి ఏజెంట్ తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.
విడాకుల తర్వాత చైతన్య, సమంత మొదటిసారి బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నారు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన 'లాల్ సింగ్ చద్దా'లో చైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. చైతన్యకు ఇది మొదటి హిందీ సినిమా. ఈ చిత్రం ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'యశోద' ఒక్కరోజు తేడాతో ఆగష్టు 12న రిలీజ్ కానుంది. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ చేస్తున్న క్రేజీ మూవీ 'ఏజెంట్' కూడా ఆగష్టు 12నే విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ తేదీ మారనున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా షూటింగ్ కి ఇంకా చాలా సమయం పడుతుందట. ఎంత ప్రయత్నించినా ఆగష్టు 12కి విడుదల చేయడం సాధ్యం కాదని, అందుకే దసరాకి వాయిదా వేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. అదే నిజమైతే ఏజెంట్ కి గట్టి దెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే దసరా రేసులో బాలకృష్ణ 'NBK 107', చిరంజీవి 'గాడ్ ఫాదర్' నిలిచే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



