ఎన్టీఆర్ రికార్డు సమం చేసిన నాని
on Jun 17, 2022
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ' జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతున్న ఈ సినిమా ఓవర్సీస్ మాత్రం దూకుడు చూపిస్తోంది. తాజాగా ఈ మూవీ యూఎస్ఏ లో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రికార్డును సమం చేశాడు నాని.
టాలీవుడ్ లో మహేష్ బాబుకి ఓవర్సీస్ కింగ్ అనే పేరుంది. అందుకు తగ్గట్లే యూఎస్ లో పదకొండు 1 మిలియన్ సినిమాలతో టాలీవుడ్ హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 7 సినిమాలతో తారక్ ఉన్నాడు. 'అంటే సుందరానికీ'తో ఇప్పుడు తారక్ రికార్డుని నాని మ్యాచ్ చేశాడు. గతంలో నాని నటించిన ఆరు చిత్రాలు 'ఈగ', 'భలే భలే మగాడివోయ్', 'MCA', 'నిన్ను కోరి', 'నేను లోకల్', 'జెర్సీ' యూఎస్ లో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. తాజాగా 'అంటే సుందరానికీ' కూడా 1 మిలియన్ క్లబ్ లో చేరి ఓవర్సీస్ లో నాని సత్తాని తెలియజేసింది. నాని తర్వాతి స్థానాల్లో 6 సినిమాలతో పవన్ కళ్యాణ్, 5 సినిమాలతో అల్లు అర్జున్ ఉన్నారు.
ఓవరాల్ గా చూస్తే మాత్రం.. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల బిజినెస్ చేసిన అంటే సుందరానికీ.. వారం రోజుల్లో 18.39 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ కి ఇంకా 12 కోట్ల దూరంలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
