'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య హీరోగా మూవీ.. రంగంలోకి 'పెళ్లి చూపులు' ప్రొడ్యూసర్
on Mar 9, 2022

'పెళ్లి చూపులు', 'డియర్ కామ్రేడ్', 'దొరసాని', 'ఏబీసీడీ' వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్.. ఇప్పుడు యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్ తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. 'మత్తు వదలరా' ఫేమ్ శ్రీసింహా కోడూరి హీరోగా 'భాగ్ సాలే' అనే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది.
బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత యశ్ రంగినేని సోలోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఓ పిట్ట కథ' మూవీ డైరెక్టర్ చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావ్ మాధాడి హీరోగా నటించనున్నాడు.

థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఒక విల్లేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందనుంది . త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు మరియు మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



