దక్షిణాది పాటల గురించి స్పందించిన రష్మిక!
on Jan 12, 2023

నార్త్, సౌత్ అనే తేడా లేకుండా మంచి మంచి ఆఫర్లు తెచ్చుకుంటున్న భామ రష్మిక. తాను బాలీవుడ్ పాటలు చూస్తూ పెరిగానని, రొమాన్స్ కి సిసలైన మీనింగ్ ఈ పాటల్లో ఉంటుందని, దక్షిణాదిన అన్నీ దంపుడు పాటలేననీ అన్నారు. ఈ విషయం మీద ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తునే జరిగింది. ఇప్పుడు తన మాటల గురించి వివరణ ఇచ్చారు రష్మిక. తన మాటలకు మెలిక పెట్టారని, తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు కన్నడ బ్యూటీ. ``నాలో ఉన్న ఒక ఫాల్ట్ ఏంటో తెలుసా? నన్ను ఎవరైనా రెండు మార్కుల ప్రశ్న అడిగితే, నేను ఐదు మార్కుల ఆన్సర్ ఇస్తాను. దీన్ని సీరియస్‌గా తీసుకుని వర్క్ చేయాలి. ఎందుకంటే నేనేం మాట్లాడినా దానిలో ఇంకేదో విషయాన్ని వెతుక్కోవాలనుకుంటున్నారు జనాలు.
నేను మాట్లాడిన ప్రతిసారీ, జనాలు రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే, అరే.... నేను మాట్లాడింది అది కాదు కదా, నా భావన అది కాదు కదా.. అని చెప్పాలనిపిస్తుంది`` అని అన్నారు. ``ఆ మధ్య కూడా బాలీవుడ్‌లో రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. కానీ సౌత్‌లో మాస్ నెంబర్స్... అని చెబుతుండగానే జనాలు `మాకు తెలుసు మాకు తెలుసు` అని నా మాటలను మధ్యలోనే ఆపేశారు.. అరే.. వాళ్లు నన్ను మాట్లాడనిచ్చి ఉంటే మా సౌత్‌లో మాస్ నెంబర్స్, ఐటమ్ నెంబర్స్, రొమాంటిక్ నెంబర్స్ ఉంటాయి. నేను కడలల్లే, బెలగెడ్డు వంటి రొమాంటిక్ పాటల్లో నటించాను. వాటిని ఎందుకు మర్చిపోతాను. కానీ నా సమాధానాన్ని ఎవరూ పూర్తిగా వినలేదు. సగం విన్నప్పుడు ఇలాంటి తప్పుడు అభిప్రాయాలే వస్తాయి`` అని అన్నారు.
ఆమె నటించిన వారిసు తమిళనాడులో రిలీజ్ అయింది. తెలుగులో వారసుడు పేరుతో ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన మిషన్ మజ్ను ఈ నెల 19న ఓటీటీలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో గుడ్ బై గతేడాది విడుదలైంది. ఆమె ప్రస్తుతం ముంబైలో అనిమల్ సినిమా షూటింగ్‌లో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా అది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



