పవన్ రాజకీయం... చిరుకి ఇష్టం లేదా?
on Jan 12, 2023

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో నిలబడి పరవాలేదనిపించేలా సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ ఆయన సున్నిత మనసు కారణంగా రాజకీయాల్లో ఇమడలేకపోయారు. రాజకీయాల్లో అతి ముఖ్యమైన రంగులు మార్చడం, ఊసరవెల్లిలా మారడం వంటివి ఆయన చేయలేకపోయారు. దాంతో తన పార్టీని అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దానికి బదులుగా చిరుకి కేంద్ర మంత్రి పదవి దక్కి రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన ఖైదీ నెంబర్ 150 ద్వారా మరల సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పటినుంచి ఆయన నోటి వెంట మరల రాజకీయాల ప్రస్తావన రాలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా ఒక రాజకీయపరమైన ప్రశ్నకు చిరు ఘాటుగా బదులిచ్చారు.
ఆయన ఏపీ రాజకీయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నేను పరిశీలించడం పూర్తిగా మానేశాను. మీరందరూ రాజకీయాలను పరిశీలించే దాంట్లో పావు శాతం కూడా నేను రాజకీయాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం నా పూర్తి దృష్టి సినిమాలపైనే. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. కానీ వెళ్తాను అంటే అది వారి ఇష్టం. ఎవరి స్వతంత్రం వారిది. నా కుటుంబంలో వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు కదా అని నేను కూడా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి నన్ను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగొద్దు అని మీడియా రిపోర్టర్ కి సమాధానం ఇచ్చారు.
ఇప్పుడు ఈ సమాధానం సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం చిరంజీవి చేసిన కామెంట్స్ బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నాయి. కాగా వాల్తేరు వీరయ్య తో పాటు ఈ సంక్రాంతికి విడుదల కానున్న వీర సింహారెడ్డి కి కూడా తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం 25 రూపాయలు పెంచుకోవడానికి మాత్రమే అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



