రష్మిక అక్కడికి ఒంటరిగా వెళ్ళదట!
on Aug 29, 2020

నెక్స్ట్ టైమ్ ఇటలీ వెళ్తే ఒంటరిగా వెళ్ళనని స్టార్ హీరోయిన్ రష్మికా మందన చెబుతోంది. పక్కా ఎవరో ఒకరిని తోడు తీసుకువెళతానని అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. ఎందుకంటే? సోలోగా ట్రావెల్ చేయడానికి ఇటలీ చాలా రొమాంటిక్ గా ఉంటుందని సెలవిస్తోంది. గతంలో ఇటలీకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.
నితిన్ సరసన రష్మిక కథానాయికగా నటించిన చిత్రం 'భీష్మ'. ఆ సినిమాలో ఒక పాటను ఇటలీలో షూట్ చేశారు. అయితే, అది సినిమాలో ఉండదు. లెంగ్త్ ఎక్కువవుతుందని కట్ చేశారు. యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సాంగ్ షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఎదురైన అనుభూతులను రష్మిక గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని సొంతూరు కూర్గ్ లో ఆమె ఉన్నారని సమాచారం. రష్మిక కుటుంబానికి ఆవులు, వ్యవసాయ భూములు ఉన్నాయి. అప్పుడప్పుడు సరదాగా పొలాలకు, డైరీ ఫామ్ లకు వెళ్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



