మెగాస్టార్ కి అల్లు అరవింద్ భారీ షాక్!
on Oct 18, 2022

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, బడా నిర్మాత అల్లు అరవింద్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసకు బావ బావమరుదులైన వీరు ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉంటారు. చిరంజీవి సినీ ప్రస్థానంలో అల్లు అరవింద్ కూడా కీలక పాత్ర పోషించారని అంటుంటారు. అలాంటి అరవింద్ ఇప్పుడు మెగాస్టార్ కి భారీ షాక్ ఇచ్చారు.
ఈ అక్టోబర్ 5న 'గాడ్ ఫాదర్' చిత్రంతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో 'గాడ్ ఫాదర్' ఫలితాన్ని ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మలయాళ ఫిల్మ్ 'లూసిఫర్' రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రెండో వారం కూడా ఈ చిత్రం అదే జోరు చూపిస్తుంది అనుకుంటే ఒక డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి 'గాడ్ ఫాదర్' ఆశలపై నీళ్లు చల్లారు అల్లు అరవింద్.

కన్నడ మూవీ 'కాంతార' సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలై సంచలన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 15న అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ చిత్రానికి తెలుగులో అంచనాలకు మించిన ఆదరణ లభిస్తోంది. తొలి మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర వసూళ్లు రూ.2.1 కోట్ల షేర్, రూ.2.80 కోట్ల షేర్, రూ.1.90 కోట్ల షేర్ గా ఉన్నాయి. మూడో రోజు సోమవారం అయినప్పటికీ ఈ చిత్రం దాదాపు రూ.2 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.
మరోవైపు 'కాంతార' వచ్చినప్పటి నుంచి 'గాడ్ ఫాదర్' జోరు బాగా తగ్గిపోయింది. ఈ చివరి మూడు రోజులు 'గాడ్ ఫాదర్' వసూళ్లు పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో రూ.56 లక్షల షేర్, రూ.81 లక్షల షేర్, రూ.33 లక్షల షేర్ మాత్రమే వచ్చాయి. ఓ డబ్బింగ్ సినిమాకి వస్తున్న వసూళ్ళలో సగం కూడా మెగాస్టార్ సినిమాకి రావడంలేదు. 'కాంతార', ముందే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించడంతో తెలుగు ప్రేక్షకులకి ఆ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఒకవేళ 'కాంతార' రాకపోయినట్లయితే ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' తప్ప థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో.. 'గాడ్ ఫాదర్'కి ఇంకా మెరుగైన కలెక్షన్లే వచ్చేవి. కానీ అల్లు అరవింద్ తెలిసో తెలియకో 'కాంతార'ను విడుదల చేసి 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ గండి కొట్టి మెగాస్టార్ బిగ్ షాక్ ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



