స్టైలిష్ స్టార్ తో రాశీఖన్నా రొమాన్స్!!
on Jul 10, 2019
`ఊహలు గుస గుసలాడే ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాశీకన్నా ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించినా కూడా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు అందుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెంకీ మామతో పాటు సాయి ధరమ్ తేజ్ సరసన `ప్రతి రోజూ పండగే` చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు మరో మెగా హీరో చిత్రంలో నటిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శకుడు ఆలోచిస్తన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో దీని పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బన్నీతో `ఐకాన్` సినిమా ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా రాశీకన్నా తీసుకోవాలనుకుంటున్నరట దర్శక నిర్మాతలు. ఇది కూడా ఓకే అయితే బన్నీ తో వరుసగా రెండు సినిమాలు కొట్టేసినట్లే రాశీ కన్నా. చూద్దాం మరి రాశీకన్న లక్ ఎలా ఉందో అంటున్నారు సినీ జనాలు.
Also Read