ప్రియదర్శి బైక్ కొట్టేసిన సందీప్ కిషన్
on Jul 10, 2019

కమెడియన్ ప్రియదర్శి 'నా బైక్ ఎవరో కొట్టేశారు' అని ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో అతడిపై సెలబ్రిటీలు, సామాన్యులు సానుభూతి చూపించారు. ఎవరో ప్రియదర్శి బైక్ కొట్టేశారని చర్చ కూడా జరిగింది. అంతవరకూ ఓకే. హీరో సందీప్ కిషన్ ప్లాన్ ప్రకారమే జరిగింది. తర్వాత ట్విట్టర్‌లో హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ప్రియదర్శి బైక్ పోయిందని కంప్లయింట్ చేశారు. ఇదేదో సీరియస్ అవుతుందని సందీప్ కిషన్ సీన్‌లోకి వచ్చాడు. బైక్ పోలేదని, తానే తీసుకువెళ్లానని చెప్పాడు. ప్రియదర్శి బైక్ పోతే సందీప్ కిషన్ ఎందుకు వచ్చాడు? అని డౌట్ వచ్చిందా? అసలు మతలబు ఇక్కడే ఉంది. ప్రియదర్శి బైక్ కొట్టేసిన దొంగ సందీప్ కిషనే. కొట్టేయడం అంటే కొట్టేయలేదు. దొంగతనం చేయలేదు. సందీప్ కిషన్ హీరోగా నటించి, నిర్మించిన 'నిను వీడని నీడను నేనే'లో ప్రియదర్శి చేత ఓ క్యారెక్టర్ చేయిద్దామనుకున్నారు. కానీ, కుదరలేదు. పబ్లిసిటీ కోసం ప్రియదర్శి బైక్ తీసుకున్నాడు సందీప్ కిషన్. ప్రేక్షకులకు ఈ విషయాన్ని క్రియేటివ్‌గా చెప్పాలనుకున్నారు. కానీ, వ్యవహారం సీరియస్ అవడంతో త్వరగా అసలు సంగతి చెప్పేశారు. ఏది ఏమైనా ఈ శుక్రవారం విడుదలవుతున్న సందీప్ కిషన్ సినిమాకు సోషల్ మీడియాలో పబ్లిసిటీ దక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



