సంక్రాంతికి పెద్ద గిఫ్ట్ సంపాదించిన మారుతి!
on Jan 8, 2020

సినిమా టైటిల్ 'ప్రతి రోజు పండగే'. ఈ సినిమా తీసిన దర్శకుడు మారుతికి ఇప్పుడు నిజంగా పండగే. ఎందుకంటే... ఆయనకు పెద్ద గిఫ్ట్ వచ్చింది. దాంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన వంశీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'నీలాంటి ఫ్రెండ్ ఉంటే ప్రతీరోజు పండగే' అని దర్శకుడు మారుతి అంటున్నారు. హఠాత్తుగా వంశీపై మారుతి పొగడ్తల వర్షం కురిపించడానికి కారణమేమిటంటే... 'ప్రతిరోజూ పండగే' సినిమా ద్వారా తమ సంస్థకు మంచి విజయాన్ని అందించిన మారుతికి యూవీ నిర్మాతలు రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందజేశారు. నిర్మాతల నుంచి బహుమతిని అందుకున్న మారుతి బుధవారం జరిగిన ఓ సినిమా ప్రెస్‌మీట్‌కు ఆ కారులోనే వచ్చారు. సాయితేజ్ కథానాయకుడిగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'ప్రతిరోజూ పండగే' చిత్రం నిర్మాతలకు లాభాలాను మిగిల్చింది. రొటీన్ కథను వినోదభరితంగా మారుతి డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే పేరు వచ్చింది. మారుతితో పాటు సాయితేజ్ కెరీర్‌కు ఈ సినిమా నూతనోత్సాహాన్ని అందించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



