సుకుమార్‌పై అసహనం వ్యక్తం చేసిన చరణ్... ఎందుకంటే...
on Jun 15, 2017

అసలే వరుస పరాజయాలు బాధపెడుతున్నాయి. ఎంతో నమ్మకం పెట్టుకున్న ధ్రువ కూడా జస్ట్ యావరేజ్ సినిమా గా నిలిచింది. కనీసం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం రంగస్థలం 1985 తో అయినా కమర్షియల్ హిట్ కొట్టాలి అని అనుకున్న రామ్ చరణ్ కి ఈ వేసవిలో తీసిన రషెస్ చూడగానే దిమ్మతిరిగిందట. అసలే షూటింగ్ నిదానంగా సాగుతుందని చిరాకు మీదున్న చరణ్ సుకుమార్ ని పిలిచి తన అసహనం వ్యక్త పరిచాడట. రషెస్ అస్సలు బాలేవని... రీ-షూట్ చేయమని ఆర్డర్ పాస్ చేసాడట.
నిర్మాత కూడా రీ-షూట్ చేసినా పర్లేదు కానీ అవుట్ ఫుట్ మాత్రం అదిరిపోవాలి అని చెప్పాడట. సో, ఇప్పటి వరకు తీసిన పోర్షన్స్ అన్ని పక్కకు పెట్టి, మళ్ళీ ఫ్రెష్ గా షూట్ స్టార్ట్ చేశారట. అక్టోబర్లో పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ సమంత ఇంకో రెండు నెలలే అందుబాటులో ఉండడంతో షూటింగ్ అనుకున్న టైములో కంప్లీట్ చేయడం అసాధ్యం కాబట్టి మొదట అనుకున్న సెప్టెంబర్ కాదని జనవరికి సినిమా విడుదల పోస్టుపోన్ చేసారు. చరణ్ కి స్క్రిప్ట్ విపరీతంగా నచ్చిందట... కానీ సుకుమార్ కొంచెం తొందరపడడంతో రషెస్ అనుకున్నట్టుగా రాలేదంటే. ఏమాత్రం తొందర వద్దు నిదానంగా అయినా పర్లేదు మనకి టైం ఎక్కువగానే ఉంది కదా అని చరణ్ సుకుమార్ కి హిత బోధ చేసాడట. హీరో కామెంట్స్ తో అలెర్ట్ అయిన సుకుమార్ చేసినా తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు అని అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. చరణ్ కి రంగస్థలం 1985 తో మంచి బ్రేక్ రావాలని కోరుకుందాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



