కేటీఆర్ సినిమా మధ్యలోంచి ఎందుకు వెళ్లినట్టు
on Jun 15, 2017

ఈ శుక్రవారం విడుదలవనున్న కాదలి కొత్త వాళ్ళతో తీసిన చిన్న బడ్జెట్ సినిమా. అయినా ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి స్వయానా ఐటీ మినిస్టర్ కేటీఆర్, స్టార్ హీరో రామ్ చరణ్ రావడం ఏంటి అని అందరు ఆశ్చర్య పోయారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కాదల్ సినిమా దర్శక నిర్మాత పట్టాభి చిలుకూరి కేటీఆర్ కి చిన్ననాటి మిత్రుడు. తన మిత్రుడి సినిమా ప్రమోషన్స్ కోసం ఇండస్ట్రీ లో తనకి మిత్రుడయిన రామ్ చరణ్ ని ఆడియో లాంచ్ వేడుకకి రావాల్సిందిగా అడగడం జరిగింది. ఇద్దరు ఆ ఫంక్షన్ కి రావడంతో సినిమా పై బజ్ పెరిగింది.
అయితే, పట్టాభి ఇండస్ట్రీ పెద్దలు మరియు తనకి అత్యంత ఆప్త మిత్రులకి కాదలి స్పెషల్ షో వేసాడట. సినిమా మధ్యలో ఉండగా, కేటీఆర్ సడన్ గా ఫోన్ పట్టుకొని అలాగే బయటకి వెళ్ళిపోయాడట. అలా వెళ్లిపోయిన ఆయన మళ్ళీ షోకి తిరిగి రాలేదట. ఇంతకీ కేటీఆర్ అంత సడన్ గా సినిమా మధ్యలోంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటి. ఆయనకీ సినిమా నచ్చలేదా? లేక వేరే ఇంకేదయినా అఫీషియల్ వర్క్ ఉండి వెళ్లిపోవాల్సి వచ్చిందా? అనేది అందరి సందేహం. ఆడియో ఫంక్షన్లో తన మిత్రుడి కోసం బిజీ షెడ్యూల్ లో కూడా అంత సమయం వెచ్చించిన మంత్రిగారు సినిమా మాత్రం సాంతం చూడకుండా వెళ్లిపోవడంతో అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకింత షాక్ కి గురయ్యారంట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



