తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడికి తలొగ్గిన మహేష్ బాబు
on Jun 15, 2017
ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న స్పైడర్ తో మహేష్ బాబు కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న విషయం మనందరికీ తెలిసిందే. మురుగదాస్ బ్రాండ్ వేల్యూ బాగా వర్క్ అవడంతో స్పైడర్ తమిళ్ రైట్స్ ఒక పేరున్న సంస్థ 18 కోట్లు వెచ్చించి తీసుకుందట. మొదట 40 కోట్ల వరకు డిమాండ్ చేసినా, మహేష్ కి ఇక్కడ మార్కెట్ లేదు కదా అంత ఇన్వెస్ట్ చేయడం కష్టం అని... చివరకి 18 కోట్లకి ఒప్పందం చేసుకున్నారట. నిర్మాతలు ఆ అమౌంట్ కి ఒప్పుకున్న తర్వాత... డిస్ట్రిబ్యూటర్లు మరో మెలిక పెట్టారట. మహేష్ బాబు లాస్ట్ మూవీ శ్రీమంతుడు 2 కోట్లకే అమ్ముడుపోయిందని... తమిళ పంపిణీదారులకి ఆ సినిమా వల్ల పెద్దగా లాభాలు ఏం రాలేదు అని... అందువల్ల స్పైడర్ మీద 18 కోట్లు పెట్టడం కూడా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని... ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే 70 % నష్టాలు నిర్మాతలే భరించాలని కొత్త డిమాండ్ ముందుంచారట.
సినిమా మీద నమ్మకమో, లేక ఇష్యూ పెద్దది చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, నిర్మాతలు ఈ డిమాండ్ కి కూడా ఒప్పుకున్నారట. స్పైడర్ తో హిట్ కొట్టి తమిళ్లో కూడా మార్కెట్ విస్తరించాలనే యోచనలో ఉన్న మహేష్ బాబు, తన నిర్మాతలని ఈ డిమాండ్ కి ఒప్పించడంలో కీలక పాత్ర పోషించాడట. రిలీజ్ కి ముందు అనవసర తల నొప్పులు ఎందుకు అని వాళ్ళకి సర్ది చెప్పాడట. చూద్దాం స్పైడర్ ని తమిళ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో!
Also Read