పదహారేళ్ళ ప్రాయంలో `అశోక్`!
on Jul 13, 2022

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా మెప్పించాయి. వాటిలో `అశోక్`కి ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబ బంధాలు, ప్రేమ, యాక్షన్ సమ్మేళనంగా స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి కథానాయికగా నటించగా.. సోనూసూద్, ప్రకాశ్ రాజ్, రాజీవ్ కనకాల, వడివుక్కరసి, సుధ, రమాప్రభ, రఘుబాబు, సురేఖావాణి, వేణు మాధవ్, సత్యం రాజేశ్, సుప్రీత్, జీవా, కృష్ణభగవాన్, రవి కాలే, సత్యప్రకాశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. వక్కంతం వంశీ అందించిన కథకు.. సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే, గోపీమోహన్ సంభాషణలు సమకూర్చారు.
మణిశర్మ స్వరాలకు చంద్రబోస్, భాస్కరభట్ల సాహిత్యమందించారు. ``ఓ చిన్ని నవ్వు``, ``ఏకాంతంగా ఉన్నా``, ``జాబిలికి వెన్నెలనిస్తా``, ``గోల గోల``, ``నువ్వసలు``, ``ముంతాజ్ మహల్`` ఇలా ఇందులోని గీతాలన్నీ రంజింపజేశాయి. మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేశ్ నిర్మించిన `అశోక్`.. బెంగాలీ బంగ్లాదేశ్ లో `బాబర్ కోసోమ్` పేరుతో రీమేక్ అయింది. కాగా, 2006 జూలై 13న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన `అశోక్`.. నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



