ప్రధాని హత్య కేసును ఛేదించనున్న భళ్లాలదేవుడు..!
on May 16, 2017

బాహుబలిలో భళ్లాల దేవుడిగా నట పటిమను నలుదిక్కుల విశ్వవ్యాప్తం చేసిన నటుడు రానా మనదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఛేదించనున్నాడని సమాచారం.ఇది ఎలా సాధ్యమని అనుకునేరు.అది సుసాధ్యం కావడం కోసం మరో అవతారం ఎత్తబోతున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యం లో రానున్న కొత్త చిత్రంలో కేసును చేధించే అధికారి పాత్రలో రానా హీరోగా నటించనున్నాడని సమాచారం. కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్.రమేష్ దర్శకత్వం లో తెలుగు ,తమిళ,హిందీ ,కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం లో వివిధ భాషల నటీ నటులు నటించనున్నట్లు తెలుస్తుంది.రాజీవ్ గాంధీ హత్య కేసులో మలుపులుతిరిగిన సంఘటనలను ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు.ఈ కేసు విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు ఈ చిత్రం చూపించనున్నది.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమా విభిన్నమైన కోణం లో రాబోతున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



