'లవ కుశ'తో ఖుషి చేస్తాడా..!
on May 16, 2017

వరస విజయాలతో జోరుమీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా వస్తున్నకొత్త చిత్రం 'జై లవ కుశ 'లో విభిన్నమైన మూడు పాత్రలతో రానున్నాడు.జై పాత్రలో ప్రతినాయకుడిగా..లవ పాత్రలో బ్యాంక్ ఉద్యోగిగా ..కుశ పాత్రలో క్లాసికల్ నృత్యకారుడిగా కనిపించనున్నారని తెలుస్తుంది.ఈ మూడు విభిన్న పాత్రలలో మెరవనున్న ఎన్టీఆర్ పై అభిమానులలో భారీ అంచానాలు ఏర్పరచుకున్నారు.అయితే ఈ 'కుశ' పాత్ర పై విభిన్న అభిప్రాయలు నెలకొన్నాయి .తన చిన్ననాటి సంప్రదాయ నృత్యాన్ని చూపించబోతున్నాడని ఈ పాత్రపై అమితాసక్తి నెలకొంది.అయితే ఈ పాత్ర ఉండదు అని కొందరు ...పక్కాఉంటుందని మరికొందరు అంటున్నారు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ జన్మదినాన విడుదలచేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపిన నేపథ్యంలో అభిమానులలో ఎదురుచూపులు నెలకొన్నాయి.ఈ మూడుపాత్రల పై నెలకొన్న సందిగ్దత తొలిగిపోవాలంటే నాలుగు రోజులు ఆగాల్సిందే.. బాబి దర్శకత్వం లో రానున్న ఈచిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



