రానా కంచరపాలెం ట్రైలర్ బాగుంది
on Aug 16, 2018
దగ్గుబాటి రానా సమర్పణలో ‘కేరాఫ్ కంచరపాలెం' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు.. ‘కేరాఫ్ కంచరపాలెం' న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం విశేషం.. మరోవైపు రానా సమర్పణలో వస్తుండటంతో ఈ సినిమాపైన అంచనాలు బాగానే ఉన్నాయి.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది.. 'కేరాఫ్ కంచరపాలెం సినిమాను సమర్పిస్తుండటం చాలా గర్వంగా ఉంది.. ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని నమ్ముతున్నాను.. ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇది' అంటూ ట్రైలర్ విడుదల సందర్భంగా రానా ట్వీట్ చేశారు.. కంచరపాలెం ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.. సెప్టెంబర్ 7 న విడుదలవుతున్న కేరాఫ్ కంచరపాలెం సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నారు.