అందులో రానాకు 50 ఏళ్లు
on Feb 12, 2020
హిందీలో 'హథీ మేరే సాథి'.. తమిళంలో 'కాండన్'.. తెలుగులో 'అరణ్య'... టైటిల్స్ వేరు కానీ సినిమా ఒక్కటే. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన ట్రైలింగ్వల్ సినిమా ఇది. రీసెంట్ గా మూడు భాషల్లో ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. గురువారం టీజర్ రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'గజరాజు'గా విడుదలైన తమిళ 'కుంకీ' దర్శకుడు ప్రభు సాల్మాన్ ఈ సినిమా తీశారు. ఒక మావటివాడు, ఏనుగుకి మధ్య ఉన్న అనుబంధంతో సినిమా రూపొందింది. కజిరంగ, అస్సోమ్ వంటి ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను మనుషులు ఆక్రమించుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే కథతో సినిమా తెరకెక్కించారు. విశేషం ఏంటంటే... ఇందులో రానా 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నాడు. 50 ఏళ్లుగా అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడివికి అంకితం చేసిన వ్యక్తిగా రానా కనిపించనున్నాడు.
Also Read