రానాతో ఒకటి.. గోపీచంద్‌తో ఒకటి!
on Feb 22, 2020

దర్శకుడు తేజ శనివారం (ఫిబ్రవరి 22) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు.
ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్‌ను అందించిన విషయం గమనార్హం. 'రాక్షస రాజు రావణాసురుడు' (ఆర్ఆర్ఆర్) టైటిల్‌ని బట్టి అది రానా సినిమా అనే అభిప్రాయం కలుగుతోంది. చూద్దాం.. తేజ ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా వెళ్తారో, వాళ్ల అభిప్రాయానుసారం వెళ్తారో!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



