రామాయణ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..రామభక్తులకి రెండు సార్లు దీపావళి
on Nov 6, 2024

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్(ranbir kapoor)రాముడిగా,అగ్ర హీరోయిన్ సాయిపల్లవి(sai pallavi)సీతగా, కేజీఎఫ్ స్టార్ యష్(yash)రావణుడిగా , సన్నీడియోల్ హనుమంతుడిగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ(ramayana)ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరు చూపించని విజువల్స్ తో తెరకెక్కుతుంది.
రామాయణ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టుగా మేకర్స్ కన్ఫార్మ్ చేసారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా,రెండో భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేస్తునట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారకంగా కన్ఫార్మ్ చేసారు. నితీష్ తివారి(nitish tiwari)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో లారా దత్తా, రవి దుబే, అరుణ్ గోవిల్ వంటి మేటి నటులు ప్రధాన పాత్రల్లో చేస్తుండగా నమిత్ మల్హోత్రా, యష్ లు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



