ఏడుకొండలవాడ్ని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్ అండ్ అల్లు స్నేహరెడ్డి
on Nov 6, 2024

విరూపాక్ష,బ్రో వంటి విభిన్నమైన సినిమాలతో వరుస విజయాలని అందుకున్న మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్(sai durga tej)ప్రస్తుతం హనుమాన్(hanuman)చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి(niranjan reddy)నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఇటీవలే తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిన్నపాటి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రోహిత్ కె పీ(rohith kp)దర్శకుడు కాగా ఐశ్వర్య లేక్ష్మి కధానాయికగా చేస్తుంది.
రీసెంట్ గా తేజ్ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నాడు.ఆ సమయంలో అభిమానులు తేజ్ తో పెద్ద ఎత్తున ఫొటోస్ దిగారు.అదే టైంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహ(sneha reddy) కూడా స్వామిని దర్శించుకుంది.వీళ్లిద్దరు విడివిడిగా వెళ్లినా కూడా ఒకే టైంలో స్వామిని దర్శించుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక అల్లు అర్జున్ 2024 ఎలక్షన్స్ లో కోడ్ ని ఉల్లంఘించి నంద్యాల పర్యటన చేసాడని నమోదయిన కేసులో కోర్టు తమ తీర్పుని ప్రకటించింది. అల్లు అర్జున్ పర్యటన వ్యక్తిగత పర్యటన కిందకి వస్తుందని, కాబట్టి ఎన్నికల కోడ్ కి సంబంధం లేదంటూ కోర్టు కేసుని కొట్టి వేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



