రాయలసీమ బిడ్డ అని గర్వపడేలా చేస్తా..క పార్ట్ 2 ఫిక్స్
on Nov 6, 2024
కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా నటించిన 'క'(ka)మూవీ దివాలి కానుకగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోవడమే కాకుండా చాలా ఏరియాల్లో థియేటర్స్ సంఖ్య ని కూడా పెంచుకోంది.ఇక చిత్ర విజయాన్ని పురస్కరించుకొని కిరణ్ తాజాగా తన స్వంత ఏరియా కడప జిల్లా రాయచోటి వెళ్ళాడు.
అక్కడ థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన కిరణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ 'క' సినిమాని హిట్ చేసినందుకు రాయచోటి ప్రజలకి ధన్యవాదాలు. ఎస్ఆర్ నగర్ కల్యాణ మండపం హిట్ అయినప్పుడు కూడా రాయచోటి(rayachoti)వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడే మన వాళ్లందరితో కలిసి'క 'విజయాన్నిసెలబ్రేట్ చేసుకోవాలని వచ్చాను.మన ఊరి అబ్బాయి అని చెప్పి ఎంతో ప్రేమ చూపిస్తారు.నేను కూడా ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు తీసి మన రాయచోటి కుర్రోడు మంచి స్టేజ్ కి వెళ్ళాడురా అని గర్వపడేలా సినిమాలు చేస్తాను.
ఈ నెల పద్నాలుగు, లేదా పది హేను నుంచి కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది.'క' పార్ట్ 2 ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చాడు. అదే విధంగా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నపుడు కొంత మంది విమర్శిస్తుంటే బాధగా ఉంటుందని కూడా వెల్లడి చేసాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
