ఎట్టకేలకు 'రామారావు' డ్యూటీ ఎక్కుతున్నాడు
on Jun 22, 2022
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మార్చి 25, ఏప్రిల్ 15, జూన్ 17 ఇలా పలు తేదీలను మార్చుకుంటూ వచ్చిన రామారావు ఎట్టకేలకు డ్యూటీ ఎక్కుతున్నాడు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాని జూలై 29 న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో రవితేజ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.
కాగా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'ధమాకా', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలలో నటిస్తున్న రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'వాల్తేరు వీరయ్య'లోనూ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు.
Also Read