ఓటీటీలో 'పెళ్లి సందD'.. ముహూర్తం కుదిరింది
on Jun 22, 2022
గతేడాది థియేటర్స్ లో సందడి చేసిన 'పెళ్లి సందD' సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించి ఓటీటీలో సందడి చేయడానికి ఈ సినిమా రెడీ అవుతోంది.
శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెళ్లి సందడి'(1996) సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అదే టైటిల్ తో 25 ఏళ్ళ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినిమా తెరకెక్కింది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యూత్ ని బాగా ఆకట్టుకుంది. రోషన్-శ్రీలీల జోడీకి, సాంగ్స్ కి యూత్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్నారు.
ఇటీవల దాదాపు అన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైన మూడు, నాలుగు వారాలకే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కానీ 'పెళ్లి సందD' మాత్రం గతేడాది అక్టోబర్ 15న థియేటర్స్ లో విడుదల కాగా, 8 నెలలు తర్వాత ఓటీటీలోకి వస్తోంది. జూన్ 24వ తేదీ నుంచి ఓటీటీ వేదిక 'జీ5'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ5 నుంచి తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
