'రామారావు'కి 'ఆర్ఆర్ఆర్' దెబ్బ!
on Feb 1, 2022

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' కొత్త విడుదల తేదీ రావడంతో పలు సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. నిర్మాతలు చర్చించుకొని కలెక్షన్స్ కి గండి పడకుండా, సినిమా సినిమాకి గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మార్చి 25 న విడుదల కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 న విడుదల కావాల్సిన చిరంజీవి 'ఆచార్య' ఏప్రిల్ 29 కి వెళ్ళిపోయింది. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మే 12 కి మారిపోయింది. ఇలా పలు సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. అదేవిధంగా రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉందని తాజాగా మూవీ టీమ్ తెలిపింది.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమాల్లో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకుడు. ఈ మూవీని మార్చి 25 న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే తేదీకి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుండటంతో.. రామారావు టీమ్ ఆలోచనలో పడింది. తమ సినిమాని మార్చి 25 లేదా ఏప్రిల్ 15 న విడుదల చేస్తామని తెలుపుతూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.

'రామారావు' టీమ్ కొత్త ప్రకటనను బట్టి చూస్తే మార్చి 25 కి ఈ సినిమా విడుదల కావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మా సినిమాపై ప్రేమ ఉంది, ఇతర సినిమాలపై గౌరవం ఉందంటూ.. తమ సినిమాని మార్చి 25 లేదా ఏప్రిల్ 15 విడుదల చేస్తామంటూ మూవీ టీమ్ ప్రకటించడం చూస్తుంటే.. మార్చి 25 న ఆర్ఆర్ఆర్ విడుదలవుతున్న నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఏప్రిల్ 15 న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



