ఏడోసారి వెంకీ, మీనా జోడీ.. కొడుకుగా రానా!?
on Feb 1, 2022

`చంటి` (1992), `సుందరకాండ` (1992), `అబ్బాయి గారు` (1993), `సూర్య వంశం` (1998), `దృశ్యం` (2014), `దృశ్యం 2` (2021).. ఇలా ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో జంటగా కనువిందు చేశారు విక్టరీ వెంకటేశ్, అభినేత్రి మీనా. జోడీగా నటించిన ప్రతీసారి తెలుగు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నారు. కట్ చేస్తే.. ఈ ఇద్దరు మరోమారు కలిసి నటించబోతున్నట్లు టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, మల్టిటాలెంటెడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో రూపొందిన మలయాళ చిత్రం `బ్రో డాడీ`.. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది. పృథ్వీరాజ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాకి వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తండ్రిని అన్నగా భావించే ఓ కొడుకు.. కొడుకుని ఓ తమ్ముడిలా ట్రీట్ చేసే ఓ నాన్న.. తమకు ఎదురైన సమస్యలను ఎలా అధిగమించారన్నదే ఈ చిత్రం.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!
కాగా, ఈ సినిమా తాలూకు తెలుగు రీమేక్ రైట్స్ ని వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు సొంతం చేసుకున్నారని టాక్. అంతేకాదు.. వెంకీ, రానా కాంబినేషన్ లో రీమేక్ చేయబోతున్నారని బజ్. ఇక మాతృకలో మోహన్ లాల్ కి జంటగా నటించిన మీనా.. తెలుగులో వెంకీ సరసన కనిపించనుందని అంటున్నారు. మరి.. ఏడోసారి వెంకీ, మీనా జోడీ ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. అలాగే వారి కొడుకుగా రానా ఏ మేరకు ఆకట్టుకుంటాడన్నది కూడా ఆసక్తికరమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



