'రాధేశ్యామ్'కి పోటీగా సూర్య మూవీ.. 'ఈటీ' రిలీజ్ డేట్ వచ్చింది!
on Feb 1, 2022

'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసి సంచలన విజయాలను అందుకున్న కోలీవుడ్ స్టార్ సూర్య ఈసారి మాత్రం థియేటర్స్ లోనే సందడి చేయనున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈటీ (ఎతర్‌క్కుమ్ తునిందవన్) మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈటీ సినిమాకి పాండిరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సందడి చేయనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మార్చి 10 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

కాగా, మార్చి 11 న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' విడుదల కానుంది. ఒక్క రోజు తేడాతో ప్రభాస్, సూర్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడనున్నాయి. మరి ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



